News August 11, 2025

ఆక్వా రంగం నష్టపోకుండా చర్యలు: అచ్చెన్నాయుడు

image

AP: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం భారత్‌తో పాటు అన్ని దేశాలపై పడిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రంగానికి <<17357620>>నష్టం <<>>లేకుండా అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు. ఎల్లుండి ఆక్వా రంగంపై సమావేశం నిర్వహిస్తామని, అభివృద్ధికి నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. సమస్యను అధిగమించేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

Similar News

News August 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 12, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.42 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.58 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.44 గంటలకు
✒ ఇష: రాత్రి 8.00 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 12, 2025

BC రిజర్వేషన్ల సాధనకు త్వరలో కార్యాచరణ: కవిత

image

TG: కాంగ్రెస్ పార్టీ BCలను వంచించాలని చూస్తోందని MLC కవిత ఆరోపించారు. పలువురు BC నేతలు, జాగృతి కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ‘రాహుల్ ప్రధాని అయ్యాకే రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామనేది కంటితుడుపు చర్య. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లడం లేదు? BC రిజర్వేషన్ల సాధన కోసం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తా’ అని ఆమె వెల్లడించారు.

News August 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.