News August 4, 2024

తక్కువ రేట్లకే BSNL సేవలు అందేలా చర్యలు: పెమ్మసాని

image

AP: వచ్చే ఏడాది మార్చి నాటికి దేశమంతా BSNL 4G సేవలు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 4500 టవర్ల ద్వారా నాణ్యమైన 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అతి తక్కువ రేట్లలో సేవలు అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందన్నారు. ప్రైవేట్ సంస్థల ధరల వల్ల ప్రజలు BSNL వైపు చూస్తున్నారని వివరించారు.

Similar News

News November 17, 2025

బాలకృష్ణకు క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్

image

‘ఎమోజీ’ వివాదం ముదరడంతో హీరో బాలకృష్ణకు TG హోంశాఖ స్పెషల్ CS సీవీ ఆనంద్ క్షమాపణ చెప్పారు. 2 నెలల కిందట పైరసీ, బెట్టింగ్ యాప్‌ల విషయంపై టాలీవుడ్ ప్రముఖులతో ఆనంద్ సమావేశం నిర్వహించి Xలో ఓ పోస్టు చేశారు. అయితే ఈ భేటీకి బాలయ్యను ఎందుకు పిలవలేదని ఓ వ్యక్తి ప్రశ్నించగా, ఆనంద్ X ఖాతాను హ్యాండిల్ చేసే వ్యక్తి నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయన పోస్టును తొలగించి సారీ చెప్పారు.

News November 17, 2025

గొర్రె పిల్లలకు అందించే క్రీపు దాణా తయారీ నమూనా ఫార్ములా

image

100 కిలోల క్రీపు దాణా తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ నలగగొట్టిన మొక్కజొన్నలు 40 కిలోలు ☛ తవుడు 20 కిలోలు ☛ నూనె తీసిన చెక్క 30 కిలోలు ☛ పప్పులపరం 7 కిలోలు ☛ కిలో ఉప్పు ☛ లవణ మిశ్రమం 2 కిలోలు. వీటిని మిక్స్ చేసి క్రీపు దాణా తయారు చేసుకోవచ్చు. ఈ దాణాను గొర్రె పిల్లలకు 3 నుంచి 7 వారాల వరకు తల్లిపాలతో పాటు అందించాలి. దీన్ని గొర్రె పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి.

News November 17, 2025

సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. CM దిగ్భ్రాంతి

image

సౌదీ <<18308554>>బస్సు<<>> ప్రమాదంలో 10 మంది హైదరాబాద్‌ వాసులు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 7997959754, 9912919545 నంబర్లకు కాల్ చేయాలని CS సూచించారు. అటు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు.