News July 26, 2024

మరో 2 రోజుల్లో ‘దేవర’తో స్టెప్పులు: శేఖర్ మాస్టర్

image

ఎన్టీఆర్ ‘దేవర’పై శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ షేర్ చేశారు. డాన్స్‌కు ప్రాధాన్యమున్న పాటలో ఎన్టీఆర్‌తో స్టెప్పులేయించనున్నట్లు తెలిపారు. 2రోజుల్లో ఆ షూట్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గత సినిమాల్లో పక్కా లోకల్, యాపిల్ బ్యూటీ వంటి హిట్ సాంగ్స్‌కు శేఖర్ పనిచేశారు. ఈ నేపథ్యంలో ‘దేవర’ డాన్సులు ఎలా ఉండనున్నాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News December 26, 2025

తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

image

AP: వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టికెట్లు లేనివారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలా తోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. కొండపై రూమ్స్ దొరకడం కష్టంగా మారింది. నిన్న 72వేల మంది భక్తులు వేంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.4.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. కాగా డిసెంబర్ 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.

News December 26, 2025

సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఇవి చూడటం ముఖ్యం

image

చర్మాన్ని UV రేస్ నుంచి కాపాడటానికి సన్‌స్క్రీన్ వాడతాం. కానీ వీటిలో కొన్ని పదార్థాలు కలిస్తే హానికరంగా మారతాయంటున్నారు నిపుణులు. సన్‌స్క్రీన్లలో ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్, క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ లేకుండా చూసుకోవాలి. లేబుల్స్‌పై ఫ్రాగ్రెన్స్ అని ఉంటే థాలేట్స్, పారాబెన్స్ ఉంటే కొనకపోవడమే మంచిదని, ఇవి హార్మోన్లను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.

News December 26, 2025

సంక్రాంతికి రైతుభరోసా..!

image

TG: యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులను (ఏడాదికి ఎకరానికి రూ.12,000) సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు, పంట డేటా సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.