News January 10, 2025
కుంభమేళాకు స్టీవ్ జాబ్స్ సతీమణి

UPలో జరగనున్న మహా కుంభమేళాకు యాపిల్ కోఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ జాబ్స్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని స్వామి కైలాషానంద మహారాజ్ వెల్లడించారు. ‘ఆమె మాకు కూతురులాంటిది. కమల అనే పేరు పెట్టాం. లారెన్ ఇక్కడకు రావడం రెండోసారి. వ్యక్తిగత ప్రోగ్రాం కోసం దేశానికి వస్తున్న ఆమె కుంభమేళాలో ధ్యానం చేస్తారు. తన గురువును కలుస్తారు. ఆమెను ఊరేగింపులోనూ చేర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 28, 2026
BARCలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(<
News January 28, 2026
దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు కేసులో MLA దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. గతంలో ఇచ్చిన నోటీసులకు కూడా రిప్లై ఇవ్వలేదు. తాజాగా ఆయనను విచారణకు పిలవాలని స్పీకర్ నిర్ణయించారు. దానం విచారణ తర్వాత SCకి స్పీకర్ రిప్లై ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు MLAలకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News January 28, 2026
డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

కాన్పు తర్వాత చాలామంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్ల మార్పులు, బరువు పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్ వాడడం, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులు ఎత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


