News January 9, 2025
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్

శ్రీలంక పర్యటనకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్, పేసర్ జోస్ హేజిల్‌వుడ్ గాయాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యారు. జట్టుకు సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ నాయకత్వం వహిస్తారు. జట్టు: స్టీవ్ స్మిత్ (C), ఉస్మాన్ ఖవాజా, సామ్ కోన్స్టస్, లబుషేన్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ, జోస్ ఇంగ్లిస్, మెక్‌స్వీనీ, వెబ్‌స్టర్, లయన్, స్టార్క్, కూపర్ కనోల్లీ, మర్ఫీ, ఖునేమాన్, సీన్ అబాట్.
Similar News
News October 21, 2025
నలుగురి గురించి ఆలోచిస్తూ ఉంటే..!

నలుగురూ ఏమనుకుంటారో అని భయపడుతున్నారా? ఇది వ్యక్తిగత పురోగతికి ప్రధాన అడ్డంకి అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భయం వల్ల అనేక వినూత్న ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాల్చక, మన మనసులోనే చనిపోతున్నాయని చెబుతున్నారు. దీని నుంచి బయటపడితేనే మనం పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలమని సూచిస్తున్నారు. సొంత ఆలోచనలపై నమ్మకముంచి, నిస్సంకోచంగా ముందుకు సాగడమే విజయానికి తొలిమెట్టు అని నిపుణులు తెలిపారు.
News October 21, 2025
కూటమి VS కూటమి.. ప్రత్యర్థుల విమర్శలు

బిహార్‌లో మహా కూటమిలో విభేదాలు ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారాయి. కాంగ్రెస్, RJD, CPI, VIP పార్టీలు గ్రాండ్ అలయెన్స్‌గా ఏర్పడ్డాయి. అయితే 11 స్థానాల్లో కూటమి నేతలే పరస్పరం పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. 6 సీట్లలో RJD, కాంగ్రెస్, 4 స్థానాల్లో కాంగ్రెస్, CPI, మరో 2 చోట్ల RJD, VIP అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. NDA గెలుపునకు కూటమి బాటలు వేసిందని LJP చీఫ్ చిరాగ్ పాస్వాన్ విమర్శించారు.
News October 21, 2025
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా: కేటీఆర్

TG: తమ పార్టీలో ఉన్నామంటున్న MLAల పేర్లు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం ఏంటని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రశ్నించారు. ‘ఏ పార్టీలో ఉన్నావంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వారికి సిగ్గుందా?’ అని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆలిండియా కరప్షన్ కమిటీ అని, దానికి ఖర్గే, రాహుల్ గాంధీ నాయకులని ఖైరతాబాద్‌లో బస్తీ దవాఖానా సందర్శన సందర్భంగా KTR విమర్శించారు.