News October 29, 2024
ఆ మాటకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కొల్లు

AP: నిర్మాణ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందించే మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. బోట్ మెన్ అసోసియేషన్ల ద్వారా కూడా ఉచిత ఇసుకను అందిస్తామని పేర్కొన్నారు. సొంత వాహనాల్లో ఇసుక తీసుకెళ్లేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు. లారీలకు సైతం అనుమతులిచ్చామన్నారు. గత ప్రభుత్వం మైనింగ్ వ్యవస్థలో దోచుకుందని ఆరోపించారు.
Similar News
News November 23, 2025
రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: ఐబొమ్మ రవి తండ్రి

<<18323509>>ఎన్కౌంటర్<<>> చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పు బట్టారు. ‘ఆయనను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు రేట్లు పెరిగాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు. నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తా’ అని చెప్పారు.
News November 23, 2025
సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.
News November 23, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.oil-india.com/


