News November 4, 2024
స్టిక్కర్ స్కాం.. అమెజాన్‌కు ₹1.29 కోట్లు టోకరా పెట్టిన యువకులు
రాజస్థాన్‌కు చెందిన రాజ్‌కుమార్, సుభాశ్ అమెజాన్‌కు ₹1.29Cr టోకరా పెట్టి మంగళూరులో దొరికిపోయారు. వీరు అమెజాన్‌లో తక్కువ ధర, లక్షలు విలువైన ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ పెట్టేవారు. ఆర్డర్ వచ్చాక డెలివరీ బాయ్ కళ్లుగప్పి లక్షల విలువైన వస్తువుల స్టిక్కర్లను తక్కువ విలువైన వాటి స్టిక్కర్లతో మార్చేవారు. తీరా హైవాల్యూ ఐటం క్యాన్సిల్ చేసేవారు. తద్వారా లక్షల విలువైన వస్తువులను తక్కువ ధరకే కొట్టేసేవారు.
Similar News
News December 27, 2024
MEMORIES: కరెన్సీ నోటుపై మన్మోహన్ సంతకం
ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పొందిన ఆయన.. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. 1985 వరకు ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆయన కరెన్సీపై సంతకాలు చేసిన ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
News December 27, 2024
నేడు APలో సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి
AP: మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా నేడు ఏపీలో సెలవు ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చారని, ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ రాష్ట్రంలోనూ హాలిడే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్థికమంత్రిగా, ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసిన మన్మోహన్‌కు నివాళి ఇవ్వాలని పోస్టులు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News December 27, 2024
తినడానికి తిండిలేక మన్మోహన్ పస్తులు
ఎన్నో హోదాల్లో పనిచేసిన మన్మోహన్ ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడ్డారని ఆయన కూతురు దమన్ సింగ్ ఓ పుస్తకంలో ప్రస్తావించారు. ‘కేంబ్రిడ్జ్ వర్సిటీలో ట్యూషన్ ఫీజు, ఖర్చులు కలిపి ఏడాదికి 600పౌండ్లు అయ్యేది. పంజాబ్ వర్సిటీ 160పౌండ్లు ఇస్తుండేది. తాత డబ్బు సర్దుబాటు కాక పంపడం ఆలస్యమయ్యేది. దీంతో నాన్న కొన్నిసార్లు పస్తులు ఉండేవారు. డబ్బును పొదుపుగా వాడుతూ చాక్లెట్‌తో కడుపు నింపుకునేవారు’ అని తెలిపారు.