News July 1, 2024

అప్పటికీ.. ఇప్పటికీ తేడా ఇదే!

image

టీమ్ ఇండియా గతేడాదే వన్డే ప్రపంచకప్ నెగ్గేది. ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని భారత్.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచకప్ అందుకోవాలన్న భారతీయుల కల నెరవేరలేదు. ఈసారి టీ20 WCలోనూ భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. కానీ అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏంటంటే ఫైనల్. తుదిపోరులో సౌతాఫ్రికాపై అద్భుతంగా పుంజుకుని విశ్వవిజేతగా నిలిచింది రోహిత్ సేన.

Similar News

News April 20, 2026

ముంబై మళ్లీ గెలుపుబాట పడుతుందా?

image

IPL: మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ గెలుపు రుచి చూడని ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న MI ఈ మ్యాచ్‌తోనైనా మళ్లీ గెలుపుబాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఉన్న GT అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఈ జట్లు IPLలో ఎనిమిదిసార్లు తలపడగా GT ఐదుసార్లు గెలిచింది. ఈరోజు రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

News April 20, 2026

GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

image

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా

News April 20, 2026

అక్షయ తృతీయ అంతంత మాత్రమే!

image

అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడాలి. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల కస్టమర్లు దుకాణాలకు రావడానికే భయపడ్డారు. గతేడాది Hydలో 150 kgల బంగారం అమ్ముడైతే, ఈసారి అది 70 kgలకే పరిమితమైనట్లు వ్యాపారులు తెలిపారు. భారీ డిస్కౌంట్లు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్నపాటి కాయిన్స్ కొనడానికే చాలా మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.