News March 16, 2025
STN: జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏర్పాటు చేసిన సభ వేదిక వద్దకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేదిక వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిప్రజ్వల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 31, 2025
బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా నుంచి రక్షించాలి: కవిత

చారిత్రాత్మక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం బొమ్మలమ్మగుట్టను సందర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్నుపడిందన్నారు. సొంత ఖజానా నింపుకోవడానికి గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం గుట్టను రక్షించుకోవాలన్నారు.
News October 31, 2025
UPSC పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: విశాఖ JC

నవంబర్ 2న నిర్వహించనున్న UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3268 మంది హాజరుకానునట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని JC ఆదేశించారు.
News October 31, 2025
NTR: వైద్యశాఖలో 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నేషనల్ ఆయుష్ మిషన్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు https://apmsrb.ap.gov.in/msrb/లో నవంబర్ 1 నుంచి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ M.V. సూర్యకళ తెలిపారు. దరఖాస్తు విధానం, వేతనం తదితర వివరాలకు పై వెబ్సైట్ చూడాలన్నారు.


