News March 16, 2025
STN: జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏర్పాటు చేసిన సభ వేదిక వద్దకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేదిక వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిప్రజ్వల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 20, 2026
జగిత్యాలలో ఐపీఆర్‌పై అవగాహన కార్యక్రమం

జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మేధో సంపత్తి హక్కుల(IPR)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ MSME ఇన్నోవేటివ్ పథకం కింద ఐపీఆర్ ప్రాముఖ్యత, పేటెంట్లు, ట్రేడ్‌మార్కుల వినియోగంపై నిపుణులు వివరాలు వెల్లడించారు. MSME పథకాలు, మహిళా వ్యాపారవేత్తలకు లభించే అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, వ్యాపార ఆసక్తిగలవారు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకున్నారు.
News February 20, 2026
ఏఐ సమ్మిట్ గ్రాండ్ సక్సస్: కేంద్రమంత్రి

ఏఐ సమ్మిట్ గ్రాండ్ సక్సస్ అయిందని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ సదస్సుకు ఐదు లక్షల మందికిపైగా విజిటర్స్ వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మౌలికవసతుల్లో $250 బిలియన్ల పెట్టుబడులకు సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. వీటిలో ఎక్కువగా డేటా సెంటర్స్, సెమీకండక్టర్ ఫెసిలిటీస్‌కు సంబంధించిన పెట్టుబడులే ఉన్నాయని వెల్లడించారు. త్వరలోనే ఏఐ మిషన్ 2.0 ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
News February 20, 2026
జగిత్యాల: యువతకు వాయుసేన అగ్నివీర్ అవకాశాలపై అవగాహన

వాయుసేనలో అగ్నివీర్ వాయుగా చేరేందుకు ఉన్న అవకాశాలపై జగిత్యాలలోని SKNR కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ అధికారి సందీప్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 17½ నుంచి 21 ఏళ్ల యువత అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. మహిళా అభ్యర్థులకు మార్చి 9న, పురుష అభ్యర్థులకు మార్చి 15న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఓపెన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.


