News February 28, 2025

స్టాక్‌మార్కెట్: ₹10L CR బ్లడ్‌బాత్‌కు విరామం!

image

స్టాక్‌మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు ₹10L CR నష్టపోయారు. నిఫ్టీ 22,124 (-420), సెన్సెక్స్ 73,198 (-1414) వద్ద ముగిశాయి. Mid, SmallCap సూచీలు 2.5% మేర కుంగాయి. ఆటో, FMCG, IT, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G, PSU బ్యాంకు షేర్లు విలవిల్లాడాయి. శ్రీరామ్ ఫైనాన్స్, HDFC బ్యాంకు, కోల్ ఇండియా, ట్రెంట్, హిందాల్కో టాప్ గెయినర్స్. ఇండస్‌ఇండ్, టెక్ఎం, విప్రో, ఎయిర్‌టెల్, M&M టాప్ లూజర్స్.

Similar News

News February 28, 2025

టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 300 నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును మార్చి 3 వరకు పొడిగించారు. ఇందులో జనరల్ డ్యూటీ 260(మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ అర్హత), డొమిస్టిక్ బ్రాంచ్ 40(టెన్త్ అర్హత) పోస్టులున్నాయి. వయసు 18-22 ఏళ్లు ఉండాలి. ఫిజికల్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు 21,700-69,100 ఉంటుంది.
వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/

News February 28, 2025

CT: ఆస్ట్రేలియా చెత్త రికార్డు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా చెత్త రికార్డును నమోదు చేసింది. ఏకంగా 37 ఎక్స్‌ట్రాలు సమర్పించుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టుకిదే అత్యధికం. అంతకుముందు 2009లో విండీస్‌తో జరిగిన మ్యాచులో 36 అదనపు పరుగులు సమర్పించుకుంది. ఓవరాల్‌గా 2004లో కెన్యాతో మ్యాచులో భారత జట్టు 42 ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చింది.

News February 28, 2025

వెటరన్ యాక్టర్ ఉత్తమ్ కన్నుమూత

image

ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ(66) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1977లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన 135 ఒడియా, 30 బెంగాలీ, పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఒడియా ఫిల్మ్ ఐకాన్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఉత్తమ్ మృతిపై సీఎం మోహన్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు.

error: Content is protected !!