News February 28, 2025
స్టాక్‌మార్కెట్: ₹10L CR బ్లడ్‌బాత్‌కు విరామం!

స్టాక్‌మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు ₹10L CR నష్టపోయారు. నిఫ్టీ 22,124 (-420), సెన్సెక్స్ 73,198 (-1414) వద్ద ముగిశాయి. Mid, SmallCap సూచీలు 2.5% మేర కుంగాయి. ఆటో, FMCG, IT, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G, PSU బ్యాంకు షేర్లు విలవిల్లాడాయి. శ్రీరామ్ ఫైనాన్స్, HDFC బ్యాంకు, కోల్ ఇండియా, ట్రెంట్, హిందాల్కో టాప్ గెయినర్స్. ఇండస్‌ఇండ్, టెక్ఎం, విప్రో, ఎయిర్‌టెల్, M&M టాప్ లూజర్స్.
Similar News
News March 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 1, 2025
జెలెన్‌స్కీ ఉక్కిరిబిక్కిరి.. ట్రంప్ రాకతో అంతా తారుమారు

రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు US అండగా నిలిచింది. బైడెన్ ప్రభుత్వం ఆ దేశానికి నిధులు, యుద్ధ సామగ్రిని సమకూర్చడంతో రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా బదులిచ్చింది. కానీ ఇటీవల US ఎలక్షన్స్‌లో బైడెన్ ఓటమితో అంతా తారుమారైంది. అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు నిధులను ఆపేశారు. అసలు యుద్ధమంతా జెలెన్‌స్కీ వల్లే వస్తోందని మండిపడ్డారు. ఈక్రమంలోనే US పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీని మీడియా ముందే తిట్టిపోశారు.
News March 1, 2025
అదరగొడుతున్న మాజీలు.. మాస్టర్స్ లీగ్‌లో మరో సెంచరీ

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మాజీలు అదరగొడుతున్నారు. మొన్న ఆస్ట్రేలియా ప్లేయర్ వాట్సన్ సెంచరీతో చెలరేగగా ఇవాళ శ్రీలంక ఆటగాడు ఉపుల్ తరంగ శతకం బాదారు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 53 బంతుల్లోనే 102 రన్స్‌తో చెలరేగారు. ఇందులో 6 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో లంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS 217 రన్స్ చేయగా శ్రీలంక మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.