News August 29, 2024
Stock Market: ఆల్ టైం హై

అధిక వెయిటేజీ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి 82,134 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 25,152 వద్ద స్థిరపడ్డాయి. రెండు సూచీలు కూడా జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఏజీఎం మీటింగ్ సహా, ఫైనాన్స్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లో బుల్ దూకుడు కొనసాగింది.
Similar News
News September 15, 2025
గ్రామాల్లో మహిళా ఓటర్లే అత్యధికం: ఈసీ

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లకు గానూ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది. వీరిలో మహిళా ఓటర్లు 85,35,935 మంది కాగా పురుషులు 81,66,732 మంది ఉన్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకుపైగా ఎక్కువని పేర్కొంది.
News September 15, 2025
దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<