News November 18, 2024
Stock Market: బేర్స్ జోరు.. బుల్స్ బేజారు

స్టాక్ మార్కెట్లు మార్నింగ్ సెషన్లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మొదటి అరగంట పాటు బెంచ్ మార్క్ సూచీలు రిట్రేస్మెంట్ అవ్వకుండా నష్టాలవైపు పయనించాయి. అయితే సెన్సెక్స్ 77,000 పరిధిలో, నిఫ్టీ 23,350 పరిధిలో ఇప్పటికే రెండు సార్లు సపోర్టు తీసుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 459 పాయింట్ల నష్టంతో 77,127 వద్ద, నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో 23,401 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Similar News
News November 25, 2025
హనుమాన్ చాలీసా భావం – 20

దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||
ఎంత కష్టమైన పనులైనా హనుమంతుని అనుగ్రహం లభిస్తే అవి సులభంగా మారిపోతాయి. జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద సవాళ్లు, అడ్డంకులు మనకు అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ మన ఆత్మవిశ్వాసం, బలానికి ఆంజనేయుడిపై పెట్టుకున్న నమ్మకం తోడైతే.. ఎంతటి కష్టాలనైనా అధిగమించగలమని, పెద్ద ఇబ్బందులను దాటడం కష్టమేం కాదని ఈ హనుమాన్ చరణం వివరిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 25, 2025
తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి

AP: తేమ శాతం 17 దాటినా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. తూ.గో(D) చాగల్లు, దొమ్మేరులో మంత్రి మనోహర్తో కలిసి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షం వల్ల పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా టార్పాలిన్లు అందిస్తున్నామని చెప్పారు.
News November 25, 2025
‘అరుణాచల్’ మహిళకు వేధింపులు.. భారత్ ఫైర్!

‘అరుణాచల్’ చైనాలో భాగమంటూ భారత మహిళను షాంఘై అధికారులు <<18373970>>ఇబ్బందులకు గురిచేయడంపై<<>> IND తీవ్రంగా స్పందించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల మధ్య నెలకొంటున్న సాధారణ పరిస్థితులకు ఈ అనవసరమైన చర్య అడ్డంకి అవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. ‘అరుణాచల్ INDలో భాగం. అక్కడి వారు IND వీసాతో ట్రావెల్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ రూల్స్ను చైనా ఉల్లంఘించింది’ అని మండిపడినట్లు సమాచారం.


