News October 4, 2024
Stock Market: మళ్లీ నేలచూపులు

స్టాక్ మార్కెట్లు మళ్లీ నేలచూపులు చూశాయి. ప్రారంభ సెషన్లో Higher Highsతో దూసుకుపోయిన సూచీలు మధ్నాహ్నం 12.30 గంటలకు రివర్సల్ తీసుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 808 పాయింట్లు నష్టంతో 81,688 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల భారీ నష్టంతో 25,049 వద్ద స్థిరపడ్డాయి. ఒకానొక దశలో 25,485కు చేరుకున్న నిఫ్టీ ఒక్కసారిగా కుప్పకూలింది. 83,372కు చేరుకున్న తరువాత BSE సూచీలో కూడా అదే ప్యాటర్న్ కనిపించింది.
Similar News
News September 18, 2025
‘మార్కో’ సీక్వెల్‌కు ఉన్ని ముకుందన్ దూరం!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మార్కో’కు సీక్వెల్ రానుంది. ‘లార్డ్ మార్కో’గా రానున్న ఈ చిత్రంలో హీరోగా ఉన్ని ముకుందన్ నటించట్లేదని సినీ వర్గాలు తెలిపాయి. వేరే హీరోతో ఈ మూవీని తెరకెక్కిస్తారని పేర్కొన్నాయి. ‘మార్కో’పై వచ్చిన నెగిటివిటీ కారణంగా పార్ట్-2 చేసేందుకు ఆసక్తి లేదని గతంలోనే ఉన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’లో లీడ్ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
News September 18, 2025
చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<