News October 28, 2024
Stock Market: వరుస నష్టాలకు బ్రేక్

దీపావళికి ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం లాభాలు గడించాయి. నిఫ్టీ 158 పాయింట్లు ఎగసి 24,339 వద్ద, సెన్సెక్స్ 602 పాయింట్ల లాభంతో 80,005 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో Maruti, Hdfc Bank, TechM, Kotak Bank, Axis Bank మినహా మిగిలిన 25 స్టాక్స్ లాభపడ్డాయి. NSEలో Shriram Fin 5% లాభపడగా, Coal India 3.76% నష్టపోయింది.
Similar News
News November 19, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,24,860కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 1,100 ఎగబాకి రూ.1,14,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 19, 2025
పండ్ల తోటల్లో పిందె/కాయలు ఎందుకు రాలిపోతాయి?

పండ్ల తోటల్లో పుష్పాలు సరిగా సంపర్కం చెందకపోతే పిందె సరిగా కట్టదు. ఒకవేళ కట్టినా కాయలు ఎదగక మధ్యలోనే రాలిపోతాయి. తోటల్లో సజ్రతని, బోరాన్, కాల్షియం, పొటాష్ పోషకాలు, హోర్మోన్ల లోపం వల్ల కూడా పిందెలు, కాయ ఎదిగే దశల్లో రాలిపోతాయి. రసం పీల్చే పురుగులు, పండు ఈగ, ఆకుమచ్చ, బూడిద తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, రాత్రివేళ అల్ప ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాల వల్ల పండ్ల తోటల్లో పిందెలు, కాయలు రాలుతాయి.
News November 19, 2025
ఆ భయంతోనే ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి!

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక మంది ఛత్తీస్గఢ్ నుంచి APకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. అటు హిడ్మాను పట్టుకుని కాల్చి చంపినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హిడ్మా ఎన్కౌంటర్లోనే చనిపోయాడన్నారు.


