News November 5, 2024
Stock Market: బుల్ జోరు కొనసాగింది
బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్ రంగ షేర్లకు మంగళవారం కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. సెన్సెక్స్ 694 పాయింట్ల లాభంతో 79,476 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 24,213 వద్ద స్థిరపడ్డాయి. 78,300 పరిధిలో సెన్సెక్స్కు, నిఫ్టీకి 23,850 పరిధిలో కీలక మద్దతు లభించింది. JSW Steel 4.5%, Tata Steel 3.7% లాభపడ్డాయి. Trent 1.7%, Adni Ports 1.5% మేర నష్టపోయాయి.
Similar News
News November 5, 2024
ట్రంప్ గెలిస్తే నిజంగానే ‘పెద్ద’న్న అవుతారు!
అమెరికా ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అధిక వయస్కుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలువనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వయసు 81 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం ఆయన ప్రమాణస్వీకారం చేసిన నాటి వయసుతో పోల్చితే ట్రంప్ వయసు ఐదు నెలలు అధికం. ఈ లెక్కన ట్రంప్ గెలిస్తే అధ్యక్షుడిగా ప్రమాణం చేసే పెద్ద వయస్కుడిగా (78 ఏళ్ల నాలుగు నెలలు) చరిత్ర సృష్టిస్తారు.
News November 5, 2024
తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్: రాహుల్
TG: తెలంగాణలో చేసే కులగణన ప్రక్రియ దేశానికి రోల్ మోడల్ అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో కుల వివక్ష ఉందని, అది అగ్రకులాలకు ఎప్పుడూ కనిపించదని తెలిపారు. ఇదే విషయం తాను చెబితే దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తారని వ్యాఖ్యానించారు. అందులో నిజాన్ని పరిశీలించాలని, వాస్తవాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్లాలని రాహుల్ కోరారు.
News November 5, 2024
రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోచనలో శరద్ పవార్!
రాజకీయాలకు స్వస్తి పలకాలని శరద్ పవార్ (83) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బారామతి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘రాజ్యసభ MPగా ఏడాదిన్నర పదవీకాలం మిగిలింది. ఇప్పటివరకు పోటీ చేసిన 14 ఎన్నికల్లో ప్రతిసారీ నన్ను గెలిపించారు. ఇక ఎక్కడో ఒకచోట ఆపేయాలి. రాబోయే 30 ఏళ్లపాటు పనిచేసే కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. మంచి చేయడానికి రాజకీయాలు అవసరం లేదన్నారు.