News January 31, 2025

Stock Market: బడ్జెట్‌కి ముందు బుల్ రంకెలు

image

బ‌డ్జెట్‌పై ఇన్వెస్ట‌ర్లు గంపెడాశ‌ల‌తో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా లాభాల్లో ప‌య‌నించాయి. బ‌డ్జెట్‌లో మ‌ధ్య త‌ర‌గ‌తి, ట్యాక్స్ పేయర్స్‌కి ఊర‌ట క‌లిగించే అంశాలు ఉంటాయ‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో సూచీలు ప‌రుగులు పెట్టాయి. Sensex 740 PTS లాభంతో 77,500 వద్ద, Nifty 259 PTS ఎగసి 23,508 వద్ద స్థిరపడ్డాయి. FMCG, రియల్టీ, IT, బ్యాంకు, ఫార్మా, మెటల్, ఆటో, ఫైనాన్స్ రంగాలు రాణించాయి.

Similar News

News November 19, 2025

రిస్క్‌లో 350 కోట్లమంది వాట్సాప్ కాంటాక్ట్స్?

image

డేటా లీకేజీతో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ ప్రమాదంలో పడనున్నట్లు వియన్నా యూనివర్సిటీ హెచ్చరించింది. ఆ యూనివర్సిటీ రీసెర్చర్స్ వాట్సాప్‌లో భారీ భద్రతా లోపాన్ని గుర్తించారు. వరల్డ్ వైడ్‌గా ఉన్న 350 కోట్లమంది యూజర్ల కాంటాక్ట్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. హ్యాకర్లు లేదా వేరే వ్యక్తులు ఈ కాంటాక్ట్ నంబర్లను చోరీ చేసే అవకాశమున్నట్లు తెలిపారు.

News November 19, 2025

ICC అండర్-19 మెన్స్ WC షెడ్యూల్ విడుదల

image

ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైంది. జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు టోర్నీ జరగనుంది. 16 టీమ్స్‌ నాలుగు గ్రూపులుగా విడిపోగా గ్రూపుAలో భారత్, USA, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక్కడ టాప్ ప్రదర్శన చేసిన జట్లు సూపర్ సిక్స్‌కు, ఈ ప్రదర్శన ఆధారంగా సెమీస్ అనంతరం ఫైనల్ జట్లు ఖరారు కానున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన స్లైడ్ చేయండి.

News November 19, 2025

నేషనల్-ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

image

* గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌కి 11 రోజుల NIA కస్టడీ విధించిన పటియాలా కోర్టు
* భారత్ నుంచి షేక్ హసీనాను రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకోవాలని యోచిస్తున్న బంగ్లాదేశ్
* టెర్రర్ మాడ్యూల్ కేసులో అల్ ఫలాహ్ వర్సిటీకి సంబంధించి వెలుగులోకి కీలక విషయాలు.. ఛైర్మన్ జావద్ సిద్దిఖీ కుటుంబీల కంపెనీలకు రూ.415 కోట్లు అక్రమంగా తరలించినట్లు గుర్తించిన ED