News December 13, 2024
Stock Market: వీకెండ్లో బుల్స్ జోరు

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం మిడ్ సెషన్లో అనూహ్యంగా పుంజుకున్నాయి. ఉదయం వెయ్యికి పైగా పాయింట్ల నష్టంతో కదిలిన సెన్సెక్స్ చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 219 పాయింట్లు బలపడి 24,768 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ రంగాలైన ఐటీ, ఫైనాన్స్, బ్యాంకు, ఆటో, ప్రైవేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది.
Similar News
News October 24, 2025
కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా?

కళ్లజోడు ముఖానికి సరిపోదనో, కళ్ల రంగు మారిస్తే ఫ్యాషన్ అనో చాలామంది అమ్మాయిలు కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. వీటిని సరిగా శుభ్రం చేయకపోయినా, వాడటంలో అజాగ్రత్తగా ఉన్నా కళ్లు పొడిబారటం, కార్నియా దెబ్బతినడం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారు. కాబట్టి స్టైల్తో పాటు ఆరోగ్యాన్నీ పట్టించుకోవాలని సూచిస్తున్నారు.
News October 24, 2025
ఇవాళ భారత్ బంద్

కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వ్యతిరేకిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. అయితే దీనికి ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. దీంతో ఇవాళ బంద్ వాతావరణం కొనసాగే అవకాశం కనిపించట్లేదు. స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా నడవనున్నాయి. అటు షాపులు కూడా తెరిచే ఉండనున్నాయి.
News October 24, 2025
నేడు..

* ‘రోజ్గార్ మేళా’లో భాగంగా 51వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
* దుబాయ్లో చంద్రబాబు మూడో రోజు పర్యటన.. సాయంత్రం 6.30 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల విత్డ్రాకు ఈ రోజు మాత్రమే ఛాన్స్.. 81 మంది నామినేషన్లకు అధికారులు ఆమోదం
* WWCలో తలపడనున్న పాకిస్థాన్, శ్రీలంక


