News February 11, 2025
స్టాక్‌మార్కెట్ల క్రాష్: 4 నెలల్లో ₹85లక్షల కోట్ల నష్టం

స్టాక్‌మార్కెట్లు పతనమవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద కనీవినీ ఎరగని విధంగా ఆవిరవుతోంది. గత SEP 27న నిఫ్టీ 26,277 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 3500 పాయింట్లు పడిపోయింది. అంటే 13% పతనమైంది. ఫలితంగా ఇన్వెస్టర్లు నవంబర్‌లో రూ.31L CR, డిసెంబర్లో రూ.10L CR, జనవరిలో రూ.27L CR, ఫిబ్రవరిలో రూ.15L CR మొత్తంగా సుమారు రూ.85 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.
Similar News
News November 16, 2025
ప్రభుత్వం విఫలం.. క్వింటాల్‌కు ₹2వేల నష్టం: KTR

TG: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. ‘ప్రస్తుతం క్వింటాల్‌కు ₹8,110 కనీస మద్దతు ధర ఉంది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్లో రైతులకు ₹6,000-7,000 మాత్రమే దక్కుతోంది. రైతులు క్వింటాల్‌పై ₹2,000 వరకు నష్టపోతున్నారు. తేమ ఎక్కువగా ఉన్న పత్తిని కొనకుండా CCI కఠినంగా వ్యవహరిస్తోంది’ అని ఫైరయ్యారు.
News November 16, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 6

30. సుఖానికి ఆధారం ఏది? (జ.శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (జ.భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? (జ.కుమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (జ.మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (జ.దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (జ.ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (జ.సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (జ.అహింస)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 16, 2025
వైసీపీపై చట్టపరమైన చర్యలు: జనసేన

AP: Dy.CM పవన్ కళ్యాణ్ పేషీలో లేని సురేశ్ అనే వ్యక్తి పేషీలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు YCP తప్పుడు ఆరోపణలు చేసిందని జనసేన మండిపడింది. YCPపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు Xలో పోస్ట్ చేసింది. ‘పవన్ కళ్యాణ్ నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన వారిపై, వాటిని ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం’ అని పేర్కొంది.


