News November 27, 2024

STOCK MARKET: ఆటో, ఐటీ షేర్లకు డిమాండ్

image

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, నెలవారీ డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. సెన్సెక్స్ 80,096 (+90), నిఫ్టీ 24,221 (+25) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, IT, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్ పెరిగింది. O&G, FMCG, బ్యాంకింగ్ రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. INDUSIND, BRITANNIA, CIPLA, AIRTEL, ONGC టాప్ లూజర్స్.

Similar News

News January 29, 2026

ఏ దేవుళ్లకు ఏయే పుష్పాలు సమర్పించాలంటే?

image

విష్ణువుకు తులసి దళాలు ప్రీతికరం. మహాలక్ష్మికి తామరలు, ఎర్రని పూలు ఎంతో ఇష్టం. శివుడిని మారేడు దళాలతో పూజించాలి. సూర్యుడు, గణపతిని తెల్లజిల్లేడు పూలతో పూజిస్తే మంచి జరుగుతుంది. గాయత్రీ దేవికి మల్లె, మందార, కదంబ పుష్పాలు ఇష్టం. పూజకు వాడే పూలు తాజాగా, శుచిగా ఉండాలి. వాసన చూసినవి లేదా నేల రాలినవి వాడకూడదు. ఇలా ఇష్టమైన పూలతో దైవాన్ని అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

News January 29, 2026

‘బంగారంతో బీ కేర్‌ఫుల్’ వార్తల్లో నిజం లేదు: సజ్జనార్

image

TG: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని SMలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని CP సజ్జనార్ తెలిపారు. అలాంటి పోస్టులను షేర్ చేయొద్దని సూచించారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ పూర్తిగా సురక్షితమని హామీ ఇచ్చారు. అనుమానం వస్తే 100కు కాల్ చేసి శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.

News January 29, 2026

విజయ్ బూస్ట్ మాకు అవసరం లేదు: తమిళనాడు కాంగ్రెస్

image

కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తామంటూ TVK అధినేత విజయ్ తండ్రి SA చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు పీసీసీ చీఫ్ సెల్వపెరుంతగై సెటైర్లు వేశారు. ‘విజయ్ నుంచి మాకు బూస్ట్ అవసరం లేదు. మా క్యాడర్‌ను చూడండి. వారు ఇప్పటికే బూస్ట్‌తో ఉన్నారు. మా నేత రాహుల్ గాంధీ అవసరమైన బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌వీటా ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ కామెంట్లపై విజయ్, TVK ఇంకా స్పందించలేదు.