News September 24, 2024
Stock Market: ఫ్లాట్గా ముగిశాయి

స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 14 పాయింట్ల నష్టంతో 84,914 వద్ద, నిఫ్టీ 1.35 పాయింట్ల లాభంతో 25,940 వద్ద స్థిరపడ్డాయి. బలమైన 26,000 మార్క్ను నిఫ్టీ అధిగమించినా ఎక్కువసేపు నిలవలేకపోయింది. సెన్సెక్స్ 84,816 పరిధిలో రెండుసార్లు సపోర్ట్ తీసుకుంది. Tata Steel, Hindalco, PowerGrid, TechM, టాప్ గెయినర్స్. Sbi Life, HindUnilvr, Grasim, Ultra Cemco టాప్ లూజర్స్.
Similar News
News January 15, 2026
ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు: రాజ్ ఠాక్రే

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు వాడుతున్నారని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. సిస్టమ్ను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికే ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడగకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్గా ఉండాలని పిలుపునిచ్చారు.
News January 15, 2026
మీ ఇంటి గోవులను రేపు ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
News January 15, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్లోని <


