News October 24, 2024

Stock Market: ఫ్లాట్‌గా ముగిశాయి

image

వ‌రుస న‌ష్టాల‌తో డీలాప‌డిన దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. 80,170 వ‌ద్ద బ‌ల‌మైన రెసిస్టెన్స్‌ను దాట‌లేక‌పోయిన సెన్సెక్స్ చివ‌రికి 16 పాయింట్ల న‌ష్టంతో 80,065 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఉద‌యం అర‌గంట న‌ష్టాల‌ను 24,350 వ‌ద్ద స‌పోర్ట్ తీసుకొని అధిగ‌మించిన నిఫ్టీ చివ‌ర‌కు 36 పాయింట్లు కోల్పోయి 24,399 వ‌ద్ద నిలిచింది. Ultratech 2.66% లాభ‌ప‌డ‌గా, HindUnilvr 5.8% న‌ష్ట‌పోయింది.

Similar News

News October 24, 2024

YouTube వీడియోలు చూస్తూ జాబ్ కొట్టింది!

image

గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల బిని ముదులి యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సత్తాచాటారు. నెట్‌వర్క్ లేకపోవడంతో ఇతర ప్రాంతానికి వెళ్లి యూట్యూబ్ వీడియోలు, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌ల ద్వారా ప్రిపేర్ అయి 596వ ర్యాంకు సాధించారు. దీంతో OCSలో ఉద్యోగం పొందిన తొలి బోండా జాతి యువతిగా ఆమె చరిత్ర సృష్టించారు. పేరెంట్స్ కోచింగ్ ఫీజు చెల్లించలేరని, సొంతంగా ప్రిపేర్ అయినట్లు ఆమె తెలిపారు.

News October 24, 2024

అమెరికా, చైనా.. రెండూ భారత్‌ను విస్మరించలేవు: నిర్మల

image

భారత్ లక్ష్యం ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే కానీ ఆధిపత్యం చెలాయించడం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నేడు భారత్ ఉన్న స్థాయిని అటు US, ఇటు చైనా రెండూ విస్మరించలేవని గుర్తుచేశారు. ‘మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం. అతి పెద్ద జనాభా కలిగిన దేశం. భూమ్మీద ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. మన ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం’ అని స్పష్టం చేశారు.

News October 24, 2024

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరికి?

image

BJP జాతీయ అధ్య‌క్ష ఎన్నిక‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఈ సారి ద‌క్షిణాది నేతకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. అదే గ‌న‌క జ‌రిగితే కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి రేసులో ముందున్న‌ట్టు తెలుస్తోంది. క‌ర్ణాట‌క‌, తెలంగాణ, AP, కేర‌ళలో పార్టీ బలోపేతానికి ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారు! ఉత్త‌రాది విష‌యానికొస్తే రాజ్‌నాథ్ సింగ్, శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్ రేసులో ఉన్నారు.