News October 15, 2024
Stock Market: పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినా..

ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందినా దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మెటల్, ఆటో షేర్లు తగ్గడం, కీలక కంపెనీల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 81,751 (-221), నిఫ్టీ 25,070 (-57) వద్ద చలిస్తున్నాయి. BPCL, BEL, ICICI BANK, INFY, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, M&M, TATA స్టీల్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లాసర్స్.
Similar News
News January 21, 2026
RGSSHలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(RGSSH) 14 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, DNB, PG డిప్లొమా, MS/MD, MCh, DM అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://rgssh.delhi.gov.in
News January 21, 2026
సింగరేణి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది: కిషన్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే సింగరేణి నిర్వహణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంత్రుల మధ్య వాటాల గొడవతోనే సింగరేణి వివాదం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.
News January 21, 2026
వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.


