News August 25, 2024
Stock Market: మండే మార్కెట్ ముచ్చట్లు

ఫెడ్ రేట్ల కోత ఊహాగానాలు, FPI ఇన్ప్లోతో దేశీయ సూచీలు గత సెషన్లో ఫ్లాట్గా ముగిసినా పాజిటివ్ ట్రెండ్లో ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. వరుసగా 7 సెషన్లలో నిఫ్టీ అప్ట్రెండ్తో మొమెంటమ్ ఇండికేటర్లు RSI, MACD పాజిటివ్ ట్రెండ్ సూచిస్తున్నాయి. నిఫ్టీకి 24,700-24,500 వద్ద కీలక సపోర్ట్ లెవల్స్ ఉండడంతో 24,800 వద్ద నిలకడగా సాగితే 25,000 చేరుకోవడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.
Similar News
News November 20, 2025
వరంగల్: ‘బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందజేయాలి’

బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందజేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్పై సమావేశంలో కోరారు. 2002 ఓటర్ల జాబితాను ప్రస్తుతం ఉన్న జాబితాతో సరిపోల్చుతున్నట్టు తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, వివరాల సవరణలు జరగనున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు, జెడ్పీ సీఈఓ రామీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News November 20, 2025
IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <
News November 20, 2025
స్కాలర్షిప్ బకాయిల విడుదలకు ఆదేశం

TG: ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2,813 కాలేజీలకు సంబంధించి రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని వెంటనే విడుదల చేయాలని భట్టి ఆదేశించారు.


