News October 30, 2024

STOCK MARKET: ఎఫ్ఎంసీజీ, మీడియా, ఐటీ షేర్లు అదుర్స్

image

దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. సెన్సెక్స్ 80,027 (-341), నిఫ్టీ 24,367 (-99) వద్ద ట్రేడవుతున్నాయి. FMCG, మీడియా, IT షేర్లు పుంజుకున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్స్, హెల్త్‌కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. సిప్లా, Dr రెడ్డీస్, సన్ ఫార్మా, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు టాప్ లూజర్స్.

Similar News

News September 16, 2025

అమరావతి ఐకానిక్ వంతెన మోడల్ ఇదే

image

ఏపీలో ఐకానిక్ <<17619158>>వంతెన<<>> నమూనాను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. 4 నమూనాలను వెబ్‌సైట్‌లో ఉంచగా అత్యధిక ఓటింగ్(14వేలకు పైగా ఓట్లు) వచ్చిన రెండో డిజైన్‌ను సెలక్ట్ చేశారు. రూ.2,500CR వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ వంతెన రాకతో హైదరాబాద్-అమరావతి మధ్య 35kmల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఈ నమూనాను కూచిపూడి నృత్యంలోని స్వస్తిక హస్త భంగిమ ఆధారంగా తీసుకున్నారు.

News September 16, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని <>ప్రసార భారతి<<>> 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు ఉద్యోగ అనుభవం గల వారు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News September 16, 2025

రేబిస్‌తో చిన్నారి మృతి

image

AP: గుంటూరు(D) పొన్నూరు (M) వెల్లటూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తాడిశెట్టి కార్తీక్(5) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గత నెల 22న కుక్కలు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. 3రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం GNT ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.