News September 9, 2024
Stock Market: నష్టాల నుంచి లాభాల్లోకి

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఆరంభ నష్టాలను అధిగమించి లాభాలు గడించాయి. సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 81,559 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 24,936 వద్ద నిలిచాయి. ఉదయం నుంచి కూడా 24,950 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఎదుర్కొన్న నిఫ్టీ సూచీ అక్కడక్కడే కన్సాలిడేట్ అయ్యింది. ఆమెరికా జాబ్ డేటా భయపెట్టినా కూడా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడం గమనార్హం.
Similar News
News November 25, 2025
గ్యాస్ లీకైనపుడు ఏం చేయాలంటే?

ఇంట్లో గ్యాస్ సిలిండర్, స్టవ్ లీకేజీ, నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరిగి తీవ్ర విషాదాలను మిగులుస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. గ్యాస్ లీకై దాన్ని అదుపు చేయలేకపోతే కిటికీలు, తలుపులు తెరవాలి. మంటలు చెలరేగితే మందపాటి దుప్పటి కప్పి ఆర్పేయాలి. రెగ్యులేటర్‌ను ఆపేయాలి. సిలిండర్ దగ్గర మంటలు చెలరేగితే తడిగా ఉండే గోనెసంచి/ వస్త్రాన్ని వేయాలి. అగ్నిమాపక శాఖ టోల్‌ఫ్రీ నంబరు 101కు సమాచారం ఇవ్వాలి.
News November 25, 2025
అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారు?

అంత్యక్రియలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లిన వాళ్లందరూ స్నానం చేస్తారు. లేకపోతే ఆత్మలు దేహంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. దహన సంస్కారాల సమయంలో ఆ దేహం నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటువ్యాధులు మనక్కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ అంటురోగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, కచ్చితంగా స్నానం చేయాలి. అప్పట్లో నదులే స్నానానికి ప్రధాన వనరులు కాబట్టి అక్కడే స్నానమాచరించేవారు.
News November 25, 2025
వినూత్న నిరసన.. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మాండ్సౌర్ జిల్లాలోని ధమ్నార్‌లో ఉల్లిగడ్డలను పాడెపై పేర్చి అంత్యక్రియలు చేశారు. దేశంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న మాల్వా-నిమర్‌లో కేజీ రూపాయి పలుకుతున్నట్లు వాపోయారు. పండించేందుకు రూ.10-12 ఖర్చు అవుతుందని, ధరలు తగ్గడంతో నష్టాలే మిగులుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.


