News November 29, 2024

Stock Market: వీకెండ్‌లో లాభాలు

image

స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని లాభాల‌తో ముగించాయి. Heavy Weight Stocksకు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో Sensex 759 పాయింట్ల లాభంతో 79,802 వ‌ద్ద‌, Nifty 216 పాయింట్ల లాభంతో 24,131 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఫార్మా, రియ‌ల్టీ, ఆటో, IT, ఫైనాన్స్ రంగ షేర్లు Greenలో ముగిశాయి. Bharti Artl 4.40%, Sun Pharma 2.87%, Cipla 2.63%, M&M లాభ‌ప‌డ్డాయి. Power Grid, Shriram Fin, Hero Motoco, Hdfc Life న‌ష్ట‌పోయాయి.

Similar News

News December 6, 2025

రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల

image

రూపాయి పతనంపై కేంద్ర మంత్రి నిర్మల స్పందించారు. రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుందని అన్నారు. ఈ పతనం ప్రతికూలం కాదని, ఎగుమతిదారులకు ప్రయోజనకరమని చెప్పారు. ‘రూపాయి, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్ల వంటివి చాలా సెన్సిటివ్ అంశాలు. మేం ప్రతిపక్షంలో ఉండగా నిరసనలు చేశాం. కానీ అప్పట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎకానమీ ఏ పొజిషన్‌లో ఉందో చూడండి’ అని HT సమ్మిట్‌లో అన్నారు.

News December 6, 2025

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు(1/2)

image

వైరస్ ఆశించిన కూరగాయల మొక్కల్లో లేత ఆకులు చిన్నగా, పసుపు రంగుకు మారి పాలిపోయినట్లు కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై అక్కడక్కడ పసుపురంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులపై పసుపు చారలు ఏర్పడి, గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్యభాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకుల ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారతాయి. మొక్క చివరి ఆకులు ఎండి, చనిపోయినట్లుగా ఉంటాయి.

News December 6, 2025

అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

*విదేశాల్లో ఎకనామిక్స్‌లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్‌లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి