News November 12, 2024
Stock Market: మళ్లీ భారీ నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలు చవిచూస్తున్నాయి. మంగళవారం సెన్సెక్స్ 820 పాయింట్లు నష్టపోయి 78,675 వద్ద, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 23,883 వద్ద స్థిరపడ్డాయి. రెండు బెంచ్ మార్క్ సూచీల్లో Lower Lows మినహా ఏకమైనా అప్ ట్రెండ్ ప్యాటర్న్ దర్శనమివ్వలేదు. 23,900 పరిధిలో నిఫ్టీకి, 78,800 పరిధిలోని సెన్సెక్స్‌కి కొంత సపోర్ట్ లభించినా చివరికి ఆ స్థాయులు కూడా Break Down అయ్యాయి.
Similar News
News January 2, 2025
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిశోర్
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పట్నాలోని గాంధీ మైదాన్‌లో దీక్ష ప్రారంభించిన PK మరోసారి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోస్టుల్ని అమ్మకానికి పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. Dec 13న జరిగిన 70వ BPSC ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
News January 2, 2025
2 ఎకరాలతో రూ.931 కోట్లు ఎలా?: రోజా
AP: చంద్రబాబు దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలవడంపై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ‘ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం సుమారు రూ.1,000 కోట్లతో దేశంలో అత్యంత ఆస్తి కలిగిన సీఎంగా చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా 2 ఎకరాల ఆసామి కొడుకు అయిన చంద్రబాబు రూ.931 కోట్లు ఎలా సంపాదించారు?’ అని ట్వీట్ చేశారు.
News January 2, 2025
OFFICIAL: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు గెస్ట్‌గా పవన్ కళ్యాణ్
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 4న ఏపీలోని రాజమండ్రిలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈనెల 10న విడుదల కానుంది.