News January 3, 2025
Stock Market: నష్టాల్లోకి.. పార్టీ అయిపోయింది

స్టాక్ మార్కెట్లు నష్టాలబాటపట్టాయి. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో Sensex 720 పాయింట్లు నష్టపోయి 79,223 వద్ద, నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 24,004 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం నుంచి మిడ్ సెషన్ వరకు 2 సూచీల్లో బేర్స్ ర్యాలీ జరిగింది. Niftyలో 24,000 పరిధిలో, Sensexలో 79,250 వద్ద సపోర్ట్ లభించడంతో సూచీలు కొంతమేర కోలుకున్నాయి. IT స్టాక్స్ అత్యధికంగా 1.41% నష్టపోయాయి.
Similar News
News November 24, 2025
BREAKING: భారత్ ఆలౌట్

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు ఆలౌటైంది. 122కే 7 వికెట్లు కోల్పోయిన దశలో సుందర్, కుల్దీప్ 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్ 58, రాహుల్ 22, సాయి 15, పంత్ 7, జడేజా 6, నితీశ్ రెడ్డి 10, సుందర్ 48, కుల్దీప్ 19, బుమ్రా 5 రన్స్ చేశారు. IND 288 పరుగులు వెనుకబడింది. ఫాలో ఆన్ ఆడాల్సి ఉన్నా RSA బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. జాన్సెన్ 6 వికెట్లతో సత్తా చాటారు.
News November 24, 2025
ఫిలింఫేర్ అవార్డుపై ధర్మేంద్రకు అసంతృప్తి

నటనలో శిక్షణ తీసుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ అయినా ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు లభించలేదనే అసంతృప్తి ఉండేదని పలుమార్లు చెప్పేవారు. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం ఆనందాన్నిచ్చిందని ఉద్వేగభరితంగా చెప్పుకున్నారు. ‘గరమ్ ధరమ్ దాబా’, ‘హీ మ్యాన్’ బ్రాండ్లతో రెస్టారెంట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు.
News November 24, 2025
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై సీఎం సమీక్ష

APలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై CM చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఈ సిస్టమ్ పనిచేయనుంది. దీనివల్ల అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలు ఉంటుంది. కాగా కాసేపట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘంతో CM సమావేశం కానున్నారు.


