News September 4, 2024

Stock Market: నష్టాల్ని తగ్గించుకున్న సూచీలు

image

భారీ పతనం నుంచి స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. సూచీలు మోస్తరు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం 180 పాయింట్లు పతనమైన నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 25,198 వద్ద క్లోజైంది. 600 పాయింట్ల పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్ 202 పాయింట్లు ఎరుపెక్కి 82,384 వద్ద స్థిరపడింది. ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, HUL, అల్ట్రాటెక్ సెమ్, సన్ ఫార్మా టాప్ గెయినర్స్. విప్రో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హిందాల్కో, LTIM టాప్ లూజర్స్.

Similar News

News January 8, 2026

అమెరికా నియమాలను ఉల్లంఘిస్తోంది: ఫ్రాన్స్ అధ్యక్షుడు

image

అమెరికా విదేశాంగ విధానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ ఖండించారు. ‘US క్రమంగా దాని మిత్రదేశాల్లో కొన్నింటి నుంచి దూరం జరుగుతోంది. ఇంతకాలం అది ప్రోత్సహిస్తూ వచ్చిన అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తోంది. కొత్త వలసవాదం, సామ్రాజ్యవాదాన్ని ఫ్రాన్స్ తిరస్కరిస్తుంది’ అని మేక్రాన్ చెప్పారు. ప్రపంచం దోపిడీదారుల డెన్‌లా మారే ప్రమాదం ఉందని ఫ్రాంక్ వాల్టర్ అన్నారు.

News January 8, 2026

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

image

AP: RTC అద్దె బస్సుల యజమానులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సమ్మె నోటీసులిచ్చారు. బస్సు అద్దె పెంచాలని అందులో డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్త్రీశక్తితో అధిక రద్దీ వల్ల భారం పడుతోందని, అదనంగా నెలకు రూ.15-20వేల వరకు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 2,500 వరకు అద్దె బస్సులుండగా, సమ్మెకు దిగితే సంక్రాంతి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.

News January 8, 2026

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్‌లో ముగ్గురు ఇండియన్లు!

image

రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్‌ను అమెరికా నిన్న <<18791945>>స్వాధీనం<<>> చేసుకున్న విషయం తెలిసిందే. అందులోని 28 మంది సిబ్బందిలో ముగ్గురు ఇండియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. 17మంది ఉక్రేనియన్లు, ఆరుగురు జార్జియా పౌరులు, ఇద్దరు రష్యన్లు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ US నిర్బంధించింది. సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని, విదేశీయులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని రష్యా డిమాండ్ చేసింది.