News September 17, 2024
Stock Market: ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు

US ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు. సెన్సెక్స్ రోజంతా 82,866 – 83,153 మధ్య కన్సాలిడేట్ అవుతూ చివరికి 90 పాయింట్ల లాభంతో 83,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 25,418 వద్ద నిలిచింది. హీరో మోటార్స్, బజాజ్ ఆటో, Airtel టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఐచర్, టాటా స్టీల్, కోల్ ఇండియా, JSW Steel టాప్ లూజర్స్.
Similar News
News November 23, 2025
టెన్త్, ఐటీఐ అర్హతతో 542 పోస్టులు

బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో 542 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల పురుషులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, పీఈటీ/ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.50, SC, STలకు ఫీజు లేదు. దరఖాస్తు హార్డ్ కాపీ, సర్టిఫికెట్ జిరాక్స్లను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 23, 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్లో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ (ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://iigm.res.in/
News November 23, 2025
పొంచి ఉన్న తుఫాను ముప్పు.. రైతుల ఆందోళన

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, భారీ వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిర్చి తోటలు, రబీ పంటలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. వెంటనే ధాన్యాన్ని కుప్పలు వేసి, టార్పాలిన్లతో కప్పి భద్రపరచాలని అధికారులు సూచించారు.


