News September 13, 2024

Stock Market: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు

image

బెంచ్‌మార్క్ సూచీలు నేడు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి రేంజు‌బౌండ్లోనే కదలాడాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, సూచీలు గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. BSE సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టపోయి 82,890 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 25,356 వద్ద స్థిరపడింది. బజాజ్ ట్విన్స్ అదరగొట్టాయి. ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, HDFC లైఫ్ టాప్ లూజర్స్.

Similar News

News November 27, 2025

నవంబర్ 27: చరిత్రలో ఈ రోజు

image

1888: లోక్‌సభ మొదటి స్పీకర్ జి.వి.మావలాంకర్ జననం
1940: మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్ లీ జననం
1953: హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరి జననం
1975: నటి, మోడల్, రచయిత్రి సుచిత్రా కృష్ణమూర్తి జననం
1975: రేలంగి వెంకట్రామయ్య మరణం
1986: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా జననం(ఫొటోలో)
2008: భారత మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ మరణం

News November 27, 2025

టీమ్‌‍ఇండియా ఓటమిపై గిల్ రియాక్షన్

image

SAతో హోమ్ టెస్ట్ సిరీస్‌లో టీమ్‌ఇండియా వైట్‌వాష్ కావడంతో వస్తున్న విమర్శలపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదటిసారి స్పందించారు. “ప్రశాంత సముద్రాలు ఎలా ముందుకు సాగాలో నేర్పించవు.. తుఫాన్లే బలమైన చేతులను తయారు చేస్తాయి. మేమంతా ఒకరినొకరం నమ్ముకుని ముందుకు సాగుతాం” అని SMలో పోస్ట్ చేశారు. గాయం కారణంగా గిల్‌ రెండో టెస్ట్‌‌తో పాటు SAతో ODI సిరీస్‌కు సైతం దూరమైన విషయం తెలిసిందే.

News November 27, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.