News September 30, 2024
భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న Stock Market

దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. ఇటీవల సెన్సెక్స్, నిఫ్టీ జీవిత కాల గరిష్ఠాలకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నారు. దీంతో అధిక వెయిటేజీ స్టాక్లతోపాటు అన్ని కీలక రంగాల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. ఓవర్ వాల్యూయేషన్ భయాలతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, FIIల మనీ ఫ్లో తగ్గడంతో Mon మిడ్ సెషన్ వరకే సెన్సెక్స్ 1,200 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్లు నష్టపోయాయి.
Similar News
News January 23, 2026
ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.
News January 23, 2026
పీవీ సింధుపై సీఎంల ప్రశంసలు

ఇంటర్నేషనల్ కెరీర్లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదలను రేవంత్ కొనియాడారు. సింధు ఘనత దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 23, 2026
రేపటి నుంచి రష్యా-ఉక్రెయిన్-అమెరికా కీలక చర్చలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా తొలి అడుగుగా UAEలో రేపటి నుంచి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. జనవరి 23, 24 తేదీల్లో ఉక్రెయిన్, అమెరికా, రష్యా ప్రతినిధులు చర్చలు జరుపుతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దావోస్లో ప్రకటించారు. ఇది మొదటి త్రైపాక్షిక భేటీ కావడం విశేషం. US అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. రష్యా కూడా రాజీకి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.


