News October 24, 2024
STOCK MARKET: జంకుతున్న ట్రేడర్స్

దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్సే అందాయి. దీంతో ఇన్వెస్టర్లు దూకుడుగా పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు. సెన్సెక్స్ 80,151 (69), నిఫ్టీ 24,441 (6) వద్ద చలిస్తున్నాయి. FMCG, IT, METAL సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంక్, ఫైనాన్స్ సూచీలు పుంజుకున్నాయి. HUL, హిందాల్కో, SBI LIFE, నెస్లే, AIRTEL టాప్ లూజర్స్. గ్రాసిమ్, కోల్ఇండియా ఎగిశాయి.
Similar News
News January 17, 2026
డ్రాగన్ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

కలర్‌ఫుల్‌గా కనిపించే డ్రాగన్ ఫ్రూట్‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఆస్టియో పోరోసిస్ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.
News January 17, 2026
నవ గ్రహాలు వాటి ప్రత్యధి దేవతలు

ఆదిత్యుడు – రుద్రుడు
చంద్రుడు – గౌరి
అంగారకుడు – క్షేత్రపాలకుడు
బుధుడు – నారాయణుడు
గురు – ఇంద్రుడు
శుక్రుడు – ఇంద్రుడు
శని – ప్రజాపతి
రాహువు – పాము
కేతువు – బ్రహ్మ
News January 17, 2026
BECILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 3పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి PG (జెనిటిక్స్, హ్యూమన్ జీనోమిక్స్, కౌన్సెలింగ్/లైఫ్ సైన్సెస్), MSc/MTech (బయోఇన్ఫర్మాటిక్స్/జీనోమిక్స్, మైక్రో బయాలజీ), PhDతో పాటు పనిఅనుభవం గలవారు JAN 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.becil.com


