News December 10, 2024
Stock Market: చివర్లో రికవరీ
దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు Lower Lowsతో నేలచూపులు చూసిన సూచీలకు కీలక దశలో సపోర్ట్ లభించింది. అనంతరం రివర్సల్ తీసుకోవడంతో ప్రారంభ నష్టాల నుంచి రికవర్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 1.59 పాయింట్ల లాభంతో 81,510 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 24,610 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు రాణించాయి.
Similar News
News December 26, 2024
అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది?: CM రేవంత్
TG: సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాతో కలిసి తిరిగాడు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టప్రకారం వ్యవహరించాలనేది నా విధానం’ అని రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో వ్యాఖ్యానించారు.
News December 26, 2024
సినీ సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ
TG: సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సినీ పెద్దలు లేవనెత్తిన అంశాలపై చర్చించి నిర్ణయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు, సినీ నిర్మాతలు ఉండే అవకాశముంది. మరోవైపు సీఎం ప్రతిపాదనలపై సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చిస్తామని దిల్ రాజు తెలిపారు. ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News December 26, 2024
హైదరాబాద్ ప్రపంచ సినీ రాజధాని కావాలి: నాగార్జున
TG: ఈరోజు రేవంత్‌తో జరిగిన భేటీలో సినీ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తేనే సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి’ అని నాగార్జున అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. మరోవైపు సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఎన్నికల ఫలితాల్లాగే ఉత్కంఠగా ఉంటుందని మురళీమోహన్ తెలిపారు.