News September 11, 2024

Stock Market: ఉదయం లాభాలు.. సాయంత్రం నష్టాలు

image

ఉదయం భారీ లాభాల్లో ట్రేడైన బెంచ్‌మార్క్ సూచీలు సాయంత్రం నష్టాల్లోనే ముగిశాయి. 228 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన నిఫ్టీ 24,918 (-122), 711 రేంజులో చలించిన సెన్సెక్స్ 81,523 (-398) వద్ద క్లోజయ్యాయి. బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్. టాటా మోటార్స్ 5.73% పతనమైంది. ఓఎన్జీసీ, విప్రో నష్టపోయాయి. చైనా ఎకానమీ స్లోడౌన్, యూఎస్ సీపీఐ డేటా నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు.

Similar News

News December 3, 2025

ఈ పేరున్న వారికి అదృష్టం వరించింది!

image

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్‌లో మొత్తం 1.76 లక్షల మందికి అవకాశం లభించింది. టోకెన్లు పొందిన భక్తుల లిస్టు రిలీజ్ చేయగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది. ఇందులో వెంకట్& వెంకటేశ్ & శ్రీనివాస్ అనే పేర్లున్న వారే 12,099 మంది ఉన్నారు. అలాగే 10,474 మంది లక్ష్మీ, పద్మావతి &పద్మ అనే పేర్లున్నవారు ఉండటం విశేషం. తిరుమలేశుడి పేరున్నా తమకు అవకాశం రాలేదని మరికొందరు నిరాశ చెందుతున్నారు.

News December 3, 2025

టాటా ట్రస్ట్ ఎలక్షన్ ఫండ్స్.. 83 శాతం బీజేపీకే

image

2024-25 లోక్‌సభ ఎలక్షన్ ఇయర్‌లో టాటా గ్రూప్‌ అనుబంధ ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి BJPకి రూ.757 కోట్ల ఫండ్స్ అందాయి. ట్రస్ట్ అందించిన మొత్తం నిధుల్లో ఇది 83% కాగా 8.4% వాటాతో కాంగ్రెస్‌ రూ.77.3 కోట్లు అందుకుంది. ఈసీకి అందించిన వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల సమయంలో BJP, కాంగ్రెస్ సహా 10 రాజకీయ పార్టీలకు రూ.914 కోట్ల నిధులొచ్చాయి. YCP, BRS తదితర పార్టీలకు చెరో రూ.10 కోట్లు ఇచ్చింది.

News December 3, 2025

APPLY NOW: IIFTలో ఉద్యోగాలు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్‌ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కార్పొరేట్ రిలేషన్స్&కెరీర్ అడ్వాన్స్‌మెంట్ కోఆర్డినేటర్(3) పోస్టులకు ఈనెల 11వరకు, రీసెర్చ్ అసోసియేట్, కేస్ స్టడీ మేనేజర్ పోస్టులకు ఈనెల 13వరకు, గ్రాఫిక్ డిజైనర్ పోస్టుకు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA/PGDBM/PG, PhD, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. వెబ్‌సైట్: www.iift.ac.in