News October 17, 2024

STOCK MARKET: నిఫ్టీ 24,900 సపోర్ట్ బ్రేక్

image

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. 24,900 సపోర్ట్ లెవల్ బ్రేకవ్వడంతో నిఫ్టీ 221 పాయింట్లు పతనమై 24,749 వద్ద క్లోజైంది. ఇక సెన్సెక్స్ 497 పాయింట్లు తగ్గి 81,006 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం 503 పాయింట్లు పెరిగి 42,734 వద్ద ముగిసింది. FIIలు వెళ్లిపోవడం, నెగటివ్ సెంటిమెంటే క్రాష్‌కు కారణాలు. బజాజ్ ఆటో షేర్ 13.11% క్రాష్ అయింది. ఆటో, రియల్టీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.

Similar News

News December 3, 2025

‘కాటన్ ష్రెడర్’తో పత్తి వ్యర్థాల సద్వినియోగం

image

పత్తి పంటలో వ్యర్థాల తొలగింపునకు కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘కాటన్ ష్రెడర్’ యంత్రం అందుబాటులో ఉంది. ఇది పత్తి మొక్క కాండాన్ని కత్తిరించి చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ష్రెడర్ సాయంతో 3 గంటల్లో 1 హెక్టార్ భూమిలో పత్తి పంట వ్యర్థాలను తొలగించి ముక్కలుగా చేసి భూమిలో కలిపివేయవచ్చు లేదా పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. పత్తి మొక్క కాండాలను భూమిలో కలపడం వల్ల భూసారం పెరుగుతుంది.

News December 3, 2025

‘కాటన్ ష్రెడర్‌’తో మరిన్ని ప్రయోజనాలు

image

కాటన్ ష్రెడర్‌తో తక్కువ ఇంధనంతోనే మొక్క కాండాలను చిన్న ముక్కలుగా చేయవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల నేలసారం పెరగడంతో పాటు నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం భూమికి పెరుగుతుంది. మట్టి సేద్యానికి అనువుగా, వదులుగా మారుతుంది. నేల కోతను తగ్గించవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల గులాబీ పురుగు ఉద్ధృతిని చాలా వరకు తగ్గుతుంది. పంటకు మేలుచేసే సూక్ష్మజీవుల సంఖ్య వృద్ధి చెందుతుంది.

News December 3, 2025

భారత్‌ ముక్కలైతేనే బంగ్లాదేశ్‌కు శాంతి: అజ్మీ

image

బంగ్లా మాజీ ప్రధాని హసీనాను అప్పగించడంపై భారత్-బంగ్లా మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. ఇలాంటి తరుణంలో బంగ్లా ఆర్మీ మాజీ జనరల్, జమాతే ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమారుడు అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ ముక్కలవ్వకుండా ఉన్నంతకాలం బంగ్లాలో శాంతి నెలకొనదు’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. 1971 లిబరేషన్ వార్‌లో హిందువులు, ప్రో లిబరేషన్ బెంగాలీల ఊచకోతకు ఇతని తండ్రే కారణం.