News August 23, 2024
Stock Market: ఆఖరి సెషన్లో అంతంత మాత్రమే

ఈ వారం ఆఖరి సెషన్లో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. 81,165 వద్ద మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి 81,086 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 24,823 వద్ద క్లోజైంది. నిఫ్టీలో 22 కంపెనీలు లాభపడగా 28 నష్టపోయాయి. బజాజ్ ఆటో, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా టాప్ గెయినర్స్. ఎల్టీఐ మైండ్ట్రీ, విప్రో, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్ నష్టపోయాయి.
Similar News
News December 6, 2025
మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.
News December 6, 2025
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 6, 2025
భక్తికి ప్రతీక ‘తిరుమలనంబి ఆలయం’

తిరుమలనంబి శ్రీవారికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో తిరుమలకు వచ్చిన మొదటి భక్తుడు. ఆయన భగవద్రామానుజులకు అలిపిరిలో రామాయణ రహస్యాలను బోధించారు. అందుకే, శ్రీవారి ఊరేగింపు సమయంలో, దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయం వద్ద స్వామివారు ఆగి, హారతిని స్వీకరించడం ఒక సంప్రదాయంగా మారింది. ఈ ఆలయం ఆయన గొప్ప భక్తికి, శ్రీవారిపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. <<-se>>#VINAROBHAGYAMU<<>>


