News September 19, 2024
Stock Market: ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు

ఫెడ్ వడ్డీ రేట్ల కోత నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 316 పాయింట్ల లాభంతో 83,264 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 25,445 వద్ద స్థిరపడ్డాయి. ఆరంభ లాభాలను సూచీలు నిలుపుకోలేకపోయాయి. నిఫ్టీ 25,612 వద్ద- సెన్సెక్స్ 83,773 వద్ద రివర్సల్ తీసుకున్నాయి. సూచీలు ఏ సెషన్లోనూ Day High క్రాస్ చెయ్యలేకపోవడం గమనార్హం.
Similar News
News November 20, 2025
నేడు సీబీఐ కోర్టుకు జగన్

AP: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కోర్టుకు వస్తారని సమాచారం. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేటకు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని YCP నాయకులు భావిస్తున్నారు.
News November 20, 2025
నేడు కార్తీక అమావాస్య! ఇలా చేస్తే..

‘కార్తీక అమావాస్య రోజున పితృ దేవతలకు పూజ చేయాలి. దీపదానం, అన్నదానంతో ఎంతో పుణ్యం వస్తుంది. సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శివుడికి రుద్రాభిషేకం, విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించడం శుభకరం. బెల్లం, నువ్వులు నైవేద్యంగా పెట్టాలి. చీమలకు పంచదార ఇస్తే శని దోషాలు పోతాయి. ఉపవాసం ఉంటే కార్తీక మాసం మొత్తం ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది’ అని పండితులు సూచిస్తున్నారు.
News November 20, 2025
ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరు: డీకే శివకుమార్

KPCC చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనని కర్ణాటక డిప్యూటీ CM డీకే శివకుమార్ అన్నారు. ఇప్పటికే ఐదున్నరేళ్లు అయిందని, ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ‘డిప్యూటీ CM అయినప్పుడే PCC చీఫ్ పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నా. కానీ కొనసాగమని రాహుల్, ఖర్గే చెప్పారు. నా డ్యూటీ నేను చేశా’ అని తెలిపారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


