News January 30, 2025
Stock Market: మూడో రోజు కూడా లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుండడంతో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. Sensex 226 పాయింట్లు ఎగసి 76,759 వద్ద, Nifty 86 పాయింట్ల లాభంతో 23,249 వద్ద స్థిరపడింది. ఫార్మా, రియల్టీ, ఆయిల్&గ్యాస్, బ్యాంకు, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాలు రాణించాయి. BEL, Power Grid, Hero MotoCorp టాప్ గెయినర్స్.
Similar News
News January 25, 2026
17న ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

AP: వచ్చే నెల 17న రాష్ట్రంలో 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. వీరిలో ఐదేళ్లలోపు పిల్లలు 23 లక్షల మంది ఉన్నారన్నారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని పేర్కొన్నారు.
News January 25, 2026
అభిమానికి గోల్డ్ చైన్ ఇచ్చిన రజినీకాంత్

సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానికి బంగారు గొలుసు ఇచ్చారు. మధురైలో పేదల కోసం కేవలం రూ.5కే పరోటా విక్రయిస్తున్న ‘రజినీ శేఖర్’ సేవలను ప్రశంసించారు. శేఖర్ కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో బిజీగా ఉండగా, ఏప్రిల్ నుంచి సిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
News January 25, 2026
అసెంబ్లీ గందరగోళంపై రాష్ట్రపతికి నివేదిక

కర్ణాటక అసెంబ్లీలో జరిగిన <<18923034>>గందరగోళం<<>>పై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ రాష్ట్రపతి ముర్ముకు నివేదిక సమర్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఉన్న కారణంగా ప్రసంగ ముసాయిదాలోని 2 నుంచి 11 పేరాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించానని తెలిపారు. అదే విధంగా ప్రసంగం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని నివేదికలో పేర్కొన్నారు.


