News August 14, 2024

Stock Market: కొంత లాభాలు

image

దేశీయ సూచీల్లో సెన్సెక్స్ కొంత లాభాలతో గట్టెక్కగా, నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. బుధవారం ఉద‌యం కొంత గ్యాప్ అప్‌తో నిఫ్టీలో ట్రేడింగ్ ప్రారంభ‌మ‌వ్వ‌గా రోజంతా క‌న్సాలిడేషన్ జరిగింది. చివ‌రికి ఐదు పాయింట్ల లాభంతో 24,143 వ‌ద్ద నిలిచింది. అటు సెన్సెక్స్ 150 పాయింట్లు బ‌ల‌ప‌డి 79,105 వ‌ద్ద ముగిసింది. ఈ రోజు ఐటీ కంపెనీలు భారీగా లాభ‌ప‌డ్డాయి.

Similar News

News January 21, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 21, 2025

రంజీ క్రికెట్ ఆడనున్న విరాట్ కోహ్లీ

image

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌‌కు తాను అందుబాటులో ఉంటానని ఢిల్లీ&డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్‌(DDCA) ప్రెసిడెంట్ రోహన్ జైట్లీకి విరాట్ సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. 2012లో కోహ్లీ చివరిసారి రంజీ మ్యాచ్ ఆడారు. అటు CT-2025 ముందు రోహిత్, రాహుల్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

News January 21, 2025

పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

image

అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని, ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా తమ దేశ సైన్యాన్ని తయారు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘చైనా అధీనంలోని పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ఇకపై శత్రువులపై పోరాటమే అమెరికా దళాలకు ఏకైక లక్ష్యం. గల్ఫ్ ఆఫ్‌ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాం. ధరలు తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాం’ అని ట్రంప్ తెలిపారు.