News September 9, 2024
Stock Market: నష్టాలతో మొదలు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలబాటపట్టాయి. అమెరికాలో ఆగస్ట్ నెల జాబ్స్ డేటా అంచనాల కన్నా తక్కువగా రావడంతో ఆర్థిక మాంధ్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 80,987 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో 24,767 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడినట్టు తెలుస్తోంది.
Similar News
News July 5, 2025
బాధ్యతలు స్వీకరించిన రామ్‌చందర్ రావు

TG: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా రామ్‌చందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చందర్ రావును పలువురు నేతలు, నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 5, 2025
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.
News July 5, 2025
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.