News October 7, 2024

Stock Market: లాభాల్లోనే మొదలయ్యాయ్

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందడంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ 81962 (274), NSE నిఫ్టీ 25072 (57) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ బ్యాంక్, ఇన్ఫీ, సిప్లా టాప్ గెయినర్స్. టైటాన్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా టాప్ లూజర్స్. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 26:24గా ఉంది.

Similar News

News February 5, 2026

ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు

image

<>ఢిల్లీలోని<<>> ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD, MSc(ప్లాంట్ పాథాలజీ/వైరాలజీ/మాలిక్యులార్ బయాలజీ/బయో టెక్నాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్), డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iari.res.in/

News February 5, 2026

పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

image

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.

News February 5, 2026

T20 WC: టాప్ రన్స్ వీరివే..

image

మెగాటోర్నీ T20 WCలో ఇప్పటివరకు అత్యధిక పరుగుల జాబితాలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 1,292(35M) తొలి స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(1,220-47M), జయవర్దనే(1,016-31M), బట్లర్(1,013-35M), వార్నర్(984-41M), గేల్(965-33M) ఉన్నారు. 9 సార్లు జరిగిన టోర్నీలో IND, ఇంగ్లండ్, వెస్టిండీస్ రెండేసి సార్లు.. పాక్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి. >> FEB 7 నుంచి T20 WC మొదలుకానుంది.