News November 8, 2024
Stock Market: నష్టాలతో వారాంతం ముగింపు

నిఫ్టీలో 24,000 వద్ద ఉన్న కీలక సపోర్ట్ వల్ల శుక్రవారం Index కన్సాలిడేట్ అయ్యింది. చివరికి 51 పాయింట్లు నష్టపోయి 24,148 వద్ద స్థిరపడింది. Day Chartలో Bearish Spinning Top క్యాండిల్ ఫాం అవ్వడంతో తదుపరి ట్రెండ్‌పై అయోమయం నెలకొంది. సెన్సెక్స్ 79,486 (-55) వద్ద చలించింది. రియల్టీ, మీడియా, బ్యాంకు రంగాలు నష్టపోయాయి. M&M, Titan, TechM టాప్ గెయిన్స్. Trent, Coal India, Asian Paint లూజర్స్.
Similar News
News December 6, 2025
ECIL హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని<
News December 6, 2025
నాణ్యమైన బొగ్గురాక విద్యుదుత్పత్తిలో సమస్య

TG: నాణ్యమైన బొగ్గురాక డిమాండ్‌కు తగ్గ విద్యుదుత్పత్తిలో జెన్కో సమస్య ఎదుర్కొంటోంది. నాసిరకం బొగ్గువల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాలూ దెబ్బతింటున్నాయి. ఇది సరఫరాపై ప్రభావం చూపి బయటి నుంచి అధిక ధరకు కొనే పరిస్థిితి వస్తోంది. దీంతో క్వాలిటీ కోల్ కోసం సింగరేణికి లేఖ రాసింది. బకాయిపడ్డ ₹15000 CR అంశాన్నీ పరిష్కరించింది. క్వాలిటీ బొగ్గు సరఫరాకు అంగీకారం కుదుర్చుకుంది. ఇక నిర్ణీత 4200mw ఉత్పత్తి చేయనుంది.
News December 6, 2025
హిందీలో ‘పెద్ది’కి గట్టి పోటీ

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రం ‘పెద్ది’ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకి హిందీలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మార్చి 19న యశ్ ‘టాక్సిక్’తో పాటు అజయ్ దేవ్‌గణ్ ‘ధమాల్ 4’, రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటికి హిట్ టాక్ వస్తే ‘పెద్ది’ ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.


