News December 19, 2024
Stock Markets: 4 రోజుల్లో ₹10.5L కోట్ల నష్టం

US FED హాకిష్ కామెంట్స్‌తో దేశీయ స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. 4 సెషన్లలోనే నిఫ్టీ 913Pts మేర పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.10.5L కోట్లను నష్టపోయారు. నిన్న 25BPS మేర వడ్డీరేట్లను తగ్గించిన ఫెడ్ 2025లో కత్తిరింపు ఎక్కువగా ఉండదని సంకేతాలు పంపింది. దీంతో FIIలు షేర్లను తెగనమ్మి డబ్బు వెనక్కి తీసుకుంటుండటంతో రూపాయి వీక్ అవుతోంది. మరికొన్ని రోజులు సూచీలది ఇదే వైఖరని మార్కెట్ వర్గాల అంచనా.
Similar News
News December 29, 2025
ఇసుక సముద్రంలో ఒంటరిగా!

నైజర్ దేశంలోని సహారా ఎడారిలో 400KMS పరిధిలో ఒకే ఒక్క చెట్టు ఉండేది. ఎడారిలో ప్రయాణించేవారికి ఈ ‘టెనెరే వృక్షం’ ఓ దిక్సూచిలా ఉండేది. నీటికోసం భూగర్భంలోనికి తన వేళ్లను విస్తరించి ప్రాణాలు నిలుపుకుంది. ఈ చెట్టు స్థిరత్వానికి, పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచింది. 1973లో ఓ ట్రక్కు డ్రైవర్ చెట్టును ఢీకొట్టడంతో 300 ఏళ్ల దాని ప్రస్థానం ముగిసింది. ప్రస్తుతం దీని అవశేషాలను నైజర్ జాతీయ మ్యూజియంలో భద్రపరిచారు.
News December 29, 2025
2025: అత్యధిక వసూళ్ల చిత్రంగా ‘ధురంధర్’

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ నిలిచింది. ఈ చిత్రం రూ.1034.8కోట్లు రాబట్టింది. IMDb ప్రకారం 2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్-10 మూవీస్ ఇవే.. ధురంధర్, కాంతార-2 (₹853.4Cr), ఛావా(₹808.7Cr), సైయారా(₹575.8Cr), కూలీ (₹516.7Cr), వార్-2 (₹360.7Cr), మహావతార్ నరసింహ (₹326.1Cr), లోక చాప్టర్-1 (₹302.1Cr), OG (₹298.1Cr), హౌజ్‌ఫుల్-5 (₹292.5కోట్లు)
News December 29, 2025
7 ఏళ్లకే చెస్ ఛాంపియన్.. ఈ చిన్నారి గురించి తెలుసా?

ఏడేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞిక గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈ చిన్నారిని రాష్ట్రీయ బాల పురస్కార్ వరించింది. ఈ ఏడాది సెర్బియాలో జరిగిన “FIDE వరల్డ్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్-2025″లో U-7 బాలికల విభాగంలో స్వర్ణం సాధించింది. “నేను బెస్ట్ చెస్ ప్లేయర్ అవుతా” అని ఆమె మోదీతో చెెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీకి చెందిన వీరి ఫ్యామిలీ గుజరాత్‌లో స్థిరపడింది.


