News December 19, 2024
Stock Markets: 4 రోజుల్లో ₹10.5L కోట్ల నష్టం

US FED హాకిష్ కామెంట్స్‌తో దేశీయ స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. 4 సెషన్లలోనే నిఫ్టీ 913Pts మేర పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.10.5L కోట్లను నష్టపోయారు. నిన్న 25BPS మేర వడ్డీరేట్లను తగ్గించిన ఫెడ్ 2025లో కత్తిరింపు ఎక్కువగా ఉండదని సంకేతాలు పంపింది. దీంతో FIIలు షేర్లను తెగనమ్మి డబ్బు వెనక్కి తీసుకుంటుండటంతో రూపాయి వీక్ అవుతోంది. మరికొన్ని రోజులు సూచీలది ఇదే వైఖరని మార్కెట్ వర్గాల అంచనా.
Similar News
News January 29, 2026
ఆవనూనెతో చర్మ సంరక్షణ

ఆవనూనె, కొబ్బరి నూనె కలిపి ముఖంపై మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు పావుకప్పు ఆవనూనెలో రెండు చుక్కల రోజ్ ఆయిల్‌ని కలపాలి. దీనికి చెంచా బియ్యప్పిండి చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఒంటికి రాసుకుని నలుగులా రుద్దుకోవాలి. ఇది సహజమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. మృతకణాలు తొలగి మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
News January 29, 2026
మణిద్వీపం గురించి మీకు తెలుసా?

జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి నివసించే ప్రదేశమే మణిద్వీపం. ఇది భౌతిక ప్రపంచానికి అతీతంగా వైకుంఠం, కైలాసం కంటే ఉన్నతమైనదని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు ఇక్కడ చింతామణి గృహంలో కొలువై ఉండి విశ్వాన్ని పాలిస్తుంటారు. మణిద్వీపం అంటే అమ్మవారు కాదు. అది ఆమె నివాసం ఉండే ద్వీపం. ఇక్కడ అనంత సంపదలు, రత్నాలు, పారిజాత వనాలు ఉంటాయి. మణిదీప వర్ణన చదివితే దారిద్య్రం తొలగి, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.
News January 29, 2026
రబీ జొన్న పంటలో ఎదుగుదల లోపించిందా?

పెరిగిన చలి తీవ్రత కారణంగా రబీలో నాటిన జొన్న పంట ఎదుగుదల కొన్నిచోట్ల లోపించినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి లీటరు నీటికి 19-19-19 మిశ్రమాన్ని 5 గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అలాగే జొన్న పంటలో ఒకవేళ కత్తెర పురుగును గుర్తిస్తే లీటరు నీటికి క్లోరాంట్రానిప్రోల్ 0.4ml లేదా స్పైనటోరమ్ 0.5ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


