News February 17, 2025
Stock Markets: వరుసగా 9వ రోజూ ఢమాల్..

స్టాక్ మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, అనిశ్చితి కొనసాగుతుండటమే ఇందుకు కారణం. సూచీలపై బేర్స్ పట్టు సాధించడంతో నిఫ్టీ 22,748 (-182), సెన్సెక్స్ 75,326 (-602) వద్ద చలిస్తున్నాయి. ఫియర్ ఇండెక్స్ India VIX 7.90% పెరిగి 16.20కు చేరుకుంది. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్.
Similar News
News January 4, 2026
త్వరలో కృష్ణా జలాలపై మాట్లాడతా: చంద్రబాబు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న అసెంబ్లీలో TG సీఎం రేవంత్ వ్యాఖ్యలపై AP సీఎం చంద్రబాబు స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన ఆయన కృష్ణా జలాలపై త్వరలోనే మాట్లాడతానని తెలిపారు. దానికి సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తానని అన్నారు.
News January 4, 2026
దర్శకుడికి అనారోగ్యం.. ఐసీయూలో చికిత్స

ప్రముఖ దర్శకుడు భారతీరాజా అనారోగ్యంతో చెన్నైలోని MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతనెల 27న శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న ఆయనను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ICUలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం రాజా ఆరోగ్యం నిలకడగా ఉందని, ట్రీట్మెంట్కు స్పందిస్తున్నారని వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. కాగా అంతకుముందు భారతీరాజా మరణించారంటూ SMలో తప్పుడు ప్రచారం జరిగింది.
News January 4, 2026
మీ పిల్లలకు కాల్షియం లోపం రాకుండా ఇవి తినిపించండి

పిల్లల్లో కాల్షియం లోపం రాకుండా చూసుకోవాలి. ఎముకలు, దంతాల బలానికి ఇది చాలా అవసరం. అందుకే ఆహారంలో పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు తప్పనిసరిగా ఉండాలి. పాలకూర, తోటకూర, మునగాకు వంటి ఆకుకూరలు, నల్ల నువ్వులు, బాదం, రాగి జావ, రాగి లడ్డూలు, గుడ్లు, చేపలు కూడా ఎంతో మేలు చేస్తాయి. కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్-D చాలా అవసరం. అందుకే పిల్లలను ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో ఆడుకోనివ్వాలి.


