News November 27, 2024
STOCK MARKETS: సూచీలకు అదానీ కిక్కు

<<14723346>>అదానీ గ్రూప్ <<>>కంపెనీల షేర్లు కిక్కివ్వడంతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 80,234 (+230), నిఫ్టీ 24,274 (+80) వద్ద క్లోజయ్యాయి. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 5.21% తగ్గడం సానుకూల పరిణామం. ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, O&G సూచీలు కళకళలాడాయి. ADANIENT, ADANIPORTS, BEL, TRENT, NTPC టాప్ గెయినర్స్. అపోలో హాస్పిటల్స్, TITAN, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో టాప్ లూజర్స్.
Similar News
News October 21, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతరం 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఇవాళ APలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ నెల 23 ఉదయం 8.30 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 21, 2025
5,800 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

రైల్వేలో 5,800 నాన్ టెక్నికల్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ అర్హతతో 18నుంచి 33ఏళ్లు గల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్ పాసైన18 నుంచి 30 ఏళ్లు గల అభ్యర్థులు ఈనెల 28 నుంచి నవంబర్ 27వరకు దరఖాస్తు చేయవచ్చు. వెబ్సైట్: https://www.rrbcdg.gov.in/
News October 21, 2025
రసంపీల్చే పురుగుల కట్టడికి జిగురు అట్టలు

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్ త్రిప్స్.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.