News February 10, 2025
Stock Markets: అన్ని రంగాల సూచీలూ విలవిల

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 77,311 (-548), నిఫ్టీ 23,381 (-178) వద్ద ముగిశాయి. కొన్ని దేశాలపై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రకటనే ఇందుకు కారణం. ఆటో, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టి, PSU బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు విలవిల్లాడాయి. ఇండియా విక్స్ 5.55% పెరిగి 14.45కు చేరుకుంది. కొటక్ బ్యాంక్, ఎయిర్‌టెల్, బ్రిటానియా, టాటా కన్జూమర్, HCL టెక్ టాప్ గెయినర్స్.
Similar News
News March 9, 2026
నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు: సంజూ తండ్రి

భారత్ ప్రపంచకప్ గెలవడం ఆనందంగా, గర్వంగా ఉందని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ తెలిపారు. ‘సంజూ కోసం దేశంలో చాలా మంది ప్రార్థించారు. ఇప్పుడు వారంతా సంతోషంగా ఉంటారు. సెమీఫైనల్లో 250 రన్స్ చేసినా మనం 6-7 రన్స్ తేడాతోనే గెలిచాం. నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు. దాని కోసం 1-2 బాల్స్ కూడా మిస్ చేయకూడదు’ అని చెప్పారు.
News March 9, 2026
‘కల్కి’ కోసం కమల్ హాసన్‌కు రోజుకు ₹15 కోట్లు?

‘కల్కి 2898 AD’ సినిమాలో సుప్రీమ్ యాష్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ రెమ్యునరేషన్‌పై SMలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన కేవలం 10 రోజుల షూటింగ్ కోసం ఏకంగా ₹150 కోట్లు తీసుకున్నారని నటుడు యుగి సేతు అన్నారు. అంటే రోజుకు దాదాపు ₹15 కోట్లు అన్నమాట. అయితే చిత్ర బృందం మాత్రం దీన్ని కొట్టిపారేసినట్లు సమాచారం. ఇది రూమర్ మాత్రమేనని.. కమల్ పారితోషికం ఇంత భారీ స్థాయిలో ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
News March 9, 2026
బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర ₹1500

ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌లో LPG సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల (UP) బ్లాక్ మార్కెట్‌లో ధర ₹1,500కు చేరింది. యుద్ధం నేపథ్యంలో మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధర ₹60 పెరగడంతో ప్రజలు భయంతో పానిక్ బయింగ్ మొదలుపెట్టారు. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం 2 సిలిండర్ బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే రూల్ తీసుకొచ్చింది.


